Tuesday, October 27, 2020

అమ్మ స్వగతం

దేవాలయాల్లో ముఖ్యమైనది ఘంట. ఆలయానికి వచ్చిన ప్రతీ భక్తుడు ఘంట మ్రోగించడం ఆనవాయితీ . కన్యలైనా,  విద్యార్థులైనా, ఉద్యోగార్థులైనా, పిల్లలైనా, వృద్దులైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా తమ ఉనికిని తెలియజేయడాని కి ఉపయోగించే పరికరం మాత్రమే గుడిలో ఘంట.

 ఘంట స్థానం గర్భగుడికి బయటనే . దైవాన్ని తలుచుకుని ఘంట ని తాకడం ఒక ఆచారం. 

కొందరి జీవితాలు కూడా ఆలయంలో ఘంట వలే సాగుతాయి. స్థిరత్వం లేకుండా గాలిలో ఊగుతూ వచ్చే పోయే భక్తుల దెబ్బలతో ఓపికగా దైవానికి సేవచేస్తున్న ఘంటని ఎంతమంది గుర్తుంచుకుంటారు?

వ్యాకరణం లో ఘంటని స్త్రీ లింగంగానే పరిగణిస్తారు. నిజమే. స్త్రీ జీవితం కూడా ఆలయంలో ఘంటవలే స్వార్ధరహితం, సహనానికి పరాకాష్ట.. కుటుంబానికి పెద్ద కోడలైతే ఆ స్త్రీ కి బాధ్యతలతో పాటు కష్టాలు, నిందలు కూడా అనుభవించవలసి ఉంటుంది.

పసితనంలోనే వివాహ మై కాపురానికి వచ్చిన స్త్రీ కథ ఇది.

తండ్రి రైల్వే ఉద్యోగి, తల్లి లోకజ్ఞానంగల గడుసు. ఇంట్లో పనులు చేయటానికి నౌకర్లు, ఆడుకోవటానికి చిన్న తమ్ముడు ఆప్యాయంగా చూసుకునే తలిదండ్రులు. ఆ వాతావరణం లోనుండి బంధువుల కుటుంబంలోని కి పెద్ద కోడలిగా అడుగుపెట్టిన ఆమెకి మేనత్త అయిన అత్తగారి ఆరడి లేదు. మామగారు అభిమానంగా చూసేవారు. భర్త చదువుకున్న వ్యక్తి. ఆప్యాయంగా చూసుకునే పెద్దమనిషి.

ఇంటి నిండా బంధువులు. భర్త సోదరులు, ఆడపడుచులు, సందడిగా ఉండేది. తను అత్తగారితో వంటలోనూ ఇంటిపనుల్లోనూ చేదోడువాదోడుగా ఉండేది. పురుళ్ళు పుణ్యాలు సాధారణమే.  వంటలోనూ ఇంటిపనుల్లోనూ చేదోడువాదోడుగా ఉండేది. పురుళ్ళు పుణ్యాలు సాధారణమే. బడికి వెళ్లి చదవక పోయినా రామాయణ భారతాలు , కాశీమజిలి 

కథలు తెలుసు. కుట్లు,అల్లికల్లో ప్రావీణ్యం కాలంవెళ్లబుచ్చటానికి ఉపయోగపడేవి.

మితభాషి, అయిన ఆమెకి కుటుంబ వ్యవహారాలలో పాత్ర లేకపోవటా నికి కారణం ఆడబడుచుల తెలివితేటలు భర్త కి చెల్లెళ్ళ పై గల అనురాగం పరిస్థితుల ప్రభావం . ఆమెకి తన మనసు విప్పి మాట్లాడటానికి ఎవ్వరూ లేకపోవటం వలన స్వగతాల్లోనే కాలం వెళ్ల గడపటం అలవాటు చేసుకున్నది.  ఇంటి వ్యవహారాల్లో తన జోక్యం లేక పోవటం వలన తనని చిన్నచూపు చూసేవారు. భర్త పరిస్థితుల చేతులో కీలుబొమ్మ.  బాధ్యతల భారం లో ఇంటికి పెద్దదిక్కుగా కాలం నెట్టుకొస్తున్న వ్యక్తి. ఈ సమయంలో ఆమె భర్తని అర్థం చేసుకుని రోజులు గడిపేది . ఆడపడచుల నిర్లక్ష్యం చులకన చేసి మాట్లాడటం పట్టించుకునేది కాదు. తన లాగే ఇంటికి వచ్చిన కొడళ్లు

కూడా తనని గౌరవించక పోయినా భరించేది కానీ పల్లెత్తు మాట అనకపోవటం తన సహనమా లేక తెలివితక్కువతనమా లేక పిరికితనమా ? 

పిల్లలు పుట్టారు .పెద్ద అమ్మాయి తనదగ్గరే ఉండేది. మగపిల్లలు చదువులకని దూరంగా ఉండేవారు. భర్త ఉద్యోగం కారణంగా పైవూర్లలో వుంటూ తరచు ఇంటికి వచ్చి వెళ్తూవుండటం చేయటంవలన ఇంటి బాధ్యతలు తల్లి, భార్య చూస్తూ ఉండేవారు. సలహాలకి సహాయానికి వూళ్ళో ఉన్న భర్త చెల్లెలు దగ్గర వూరిలో ఉన్న మరో చెల్లెలు తరచు వచ్చి వెళ్తుండే వారు. మగపిల్లలు చదువుకోసం వచ్చినప్పటికీ కుటుంబం పెరిగి సుమారు 15 మంది ఉండేవారు.  వైద్యం కోసం ఇంటికి వచ్చేవారు ఎక్కువ రోజులు మకాం వేయటం వలన ఇంట్లో కోడలికి అత్తగారి చేతినిండా పనే. ఈ రోజుల్లోనే ఆమె కంటి చూపు మంద గించటం ప్రారంభం అయింది. కానీ ఇంట్లో పురుళ్ళు, వై ద్యం కోసం

వచ్చిన చుట్టాల తో  చూపు తగ్గుతున్న విషయం పట్టించుకునే నాధుడే లేకపోయేడు. భర్త బాధ్యతలతో సతమతమవుతున్న తరుణంలో భార్య, పెద్ద కూతురు ఇల్లు గుట్టుగా నెట్టుకొచ్చేవారు. మగపిల్లలు చదువులో ఆడ పిల్లలు ఇంటిపనుల్లో సతమౌ తున్న రోజుల్లో వారానికి ఒక రోజు పెద్దాసుపత్రికి వెళ్లి కంటిలో మందు వేయించుకునేది. కంటి చూపు వస్తుందని ఆశ. తన చూపు గురించి ఎవరూ పట్టించుకోక పోయినా లోలోపల బాధ పడింది కానీ భర్త ని కానీ అత్తగారిని కానీ తప్పుపట్టలేదు. రోజులుగడుస్తున్న వి. ఇంట్లో హడావుడి తగ్గలేదు. తన కూతురి పెళ్లి గురించి ఎవరికీ చింత లేదు. పెద్ద కొడుకు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి పైవూరు వెళ్ళటానికి వెండికంచం అమ్మి వెళ్ళేడు అది అప్పటి కుటుంబ ఆర్ధిక పరిస్థితి. పిల్లాడిని కాలేజీలో చేర్చడానికి భర్త కానీ మరెవరముందుకు రాలేదు . తను బలవంతం చేయగా ఆడపడుచు (3/4 నెలల నుండి కొడుకు, భర్త అనారోగ్యం వలన తమదగ్గరనే వున్నారు) 80 రూపాయిలు ఇచ్చి కొడుకుని కాలేజీలో చేర్పించింది. కారణం తెలిసినా ఏమీ అనలేదు అనుకోలేదు. ఆడపడుచు కొడుకు 3 నెలల అనారోగ్యం నుండి కోలు కొని కాలేజీలో ప్రవేశం తీసుకున్నాడు. ఇద్దరూ ఒక ఈ డు వారే. వారం వారం ఆసుపత్రికి వెళ్ళి మందు వేసుకున్నా ఫలితం కనబడలేదు. ఇంతలో ఇంట్లో అనారోగ్యం తో బాధపడుతున్న వారూ పురిటి కి వచ్చిన తోడికోడలు చంటి పిల్లలతో తన దృష్టి లోపం తెరమరుగై పోయింది..ఇంటికి పెద్ద కోడలైనా తెరవె నుకనేఉండిపోయింది. తండ్రి ఉద్యోగ విరమణ తర్వాత తమ దగ్గరే కొన్ని రోజులు ఉన్నాక స్వంత ఇంట్లో (మరొక ఊరులో) తల్లీ తండ్రీ వుండేవారు. తమ్ముడు దూరంగా ఉద్యోగం చేస్తూ ఏడాదికి రెండేళ్లకు వచ్చి పోతూ ఉండేవాడు. మనసువిప్పి మాట్లాడటానికి కూతురు తప్ప మరే ప్రాణి లేనందున స్వగతాల్లోనే కాలం గడిపేది. పెద్ద వాని పెళ్లి, మరిది కొడుకు పెళ్లి తర్వాత పురుళ్ళు బంధువుల రాకపోకలు తనని పట్టించుకునే. వారే లేకపోయే రు. భర్తకి మరొక ఊరు బదిలీ, ఆడపడుచు కొడుకు అనాధ కావడంతో ఆ బాధ్యత తనదిగా భర్త పిల్లాడిని దగ్గర ఉంచుకోవటం చిన్నకూ తురి వివాహం, మగపిల్లలవివాహం దూరంగా ఉద్యోగాలు వగైరా ల తో తానొక అజ్ఞాత వ్యక్తిగా కాలం గడిపేది. తల్లి చనిపోయిందని తెలిసినా వెళ్లలేకపోవటం దురదృష్టమే. తాను పడ్డ బాధ ఎవరూ గుర్తించక పోవటం బాధాకరమే. భర్త పై ఊళ్ళో వున్నారు. కొడుకుకీఇంట్లో పెత్తనం చేస్తున్న భర్త తరఫు చుట్టాల కీ తన తల్లి మరణం ఒక వార్త మాత్రమే. ఎంత ఆవేదన !! ఎంత దుఃఖం !! తన వారికీ తమ్ముడు కీ సంబంధాలు అంతంత మాత్రమే. తమ్ముడి ఆర్ధిక పరిస్థితి దిగజారింది. కంటి చూపు పోయింది. సహాయానికి తన వారు ఎవరూ ముందుకు రాలేదు. కనీసం రాకపోకలైనా చేసేవారు కారు

Narrator  --- A S Ratnam.

No comments:

Post a Comment