(forwarded msg)
*చనిపోయిన అమ్మను చూసొచ్చాను!!!*
‘‘మీ హాస్పిటల్ లో ఒక బెడ్ కావాలి ఇస్తారా? డాక్టర్‘‘
సైదాబాద్ లో మాఇంటికి అతి సమీపంలోని జయానర్సింగ్ హోం లో గైనకాలజిస్ట్ డాక్టర్ ను అడిగాను.
ఆమె ‘‘ఎవరికి‘‘ అని అడిగారు.
‘‘మా అమ్మగారికి కావాలి. ఆమె కేన్సర్ పేషంట్ అవసాన దశలో ఉన్నారు. బిపి సుగర్ హై ఫ్లక్చ్యువేషన్లు వస్తున్నాయి. ఇంట్లో ఆమెను చూసుకోవడం కష్టం అవుతోంది‘‘ అన్నాను.
‘‘ఓహ్ టెర్మినల్లీ ఇల్ పేషంటా. నో ప్రాబ్లం. నేను మీకు ఒక ఎడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళండి. అది కేస్సర్ పేషంట్లకు ఏర్పాటు చేసిన స్పర్శ్ హాస్పీస్‘‘ అన్నారు.
ఆమె మాటలకు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను జర్నలిస్టును. హైదరాబాద్ లో ఇటువంటి హాస్పీస్ ఉన్నదని కూడా నాకు తెలియదు.
డాక్టర్ కు థాంక్స్ చెప్పి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని స్పర్శ్ హాస్పీస్ కు వెళ్ళాను.
డ్యూటీ నర్సు చాలా ఆదరంగా రిసీవ్ చేసుకొంది. ఆమె సిస్టర్ అని ఆమె చెబితేకానీ నాకు తెలియలేదు. సిస్టర్ మామూలు పంజాబీడ్రస్ లో ఉంది. హాస్పీస్ లోని సిస్టర్లు యూనిఫాం వేసుకోరు. మామూలు సివిల్ డ్రస్ లోనే ఉంటారు.
నన్ను చూస్తూనే చాలా చిన్నవయసు అన్నట్టు చూసింది.
కేస్ ఫైల్ మీద ఫిమేల్, 76 ఏళ్ళు అని ఉంది చూసింది.
‘‘మీ అమ్మగారి కోసమా?‘‘ అన్నది. నేను నవ్వి ‘‘అవును సిస్టర్. నేను నేను రావడానికి ఇంకా టైంపడుతుంది‘‘ అన్నాను.
ఆమె నా ధైర్యం చూసి నవ్వింది.
డ్యూటీ డాక్టర్ సుశీల్ రెడ్డి కి సబ్మిట్ చేస్తాను రేపు ఫోన్ చేస్తాము అన్నది.
మర్నాడు నాకు వారి నుంచే ఫోన్ ‘‘పేషంట్ ను ఎప్పుడు తీసుకువస్తారు?‘‘ అని అడిగారు. నేను మర్యాదకు ‘‘నేనే వచ్చి మాట్లాడతాను డాక్టర్‘‘ అన్నాను.
మనసులో చాలా సందేహాలు. బంజారాహిల్స్ అంటే ఒళ్ళు బలిసినోళ్ళ జాగా. అక్కడ పెట్టారంటే వీళ్ళు ఏ రేంజ్ లో వసూలు చేస్తారో అనుకుంటూ వెళ్ళాను.
డాక్టర్ సుశీల్ రెడ్డి గారు ఉన్నారు. ‘‘మీ అమ్మగారి ఫైల్ చూశాను. ఎప్పుడు తీసుకువస్తారు‘‘ అన్నారు.
అమ్మకూ నాకూ కేన్సర్ వచ్చిన దగ్గర నుంచీ ఆ క్షణం వరకూ వేలు కట్టాలి, లక్షలు సిద్ధం చేసుకొని డబ్బు ఎప్పుడు తీసుకువస్తారు అన్నవారే కానీ పేషంటును ఎప్పుడు తీసుకువస్తారు అన్నవారులేరు.
‘‘సార్ ఇక్కడ ఫీజులు అవీ ఏం కట్టాలి? ఎంతకట్టాలి?‘‘ అని అడిగాను.
‘‘మీరు ఏం కట్టనవసరంలేదు. ఇక్కడ అంతా ఫ్రీ. పేషంటుకు ఏ మందులు అయినా అవసరమైతే ఆ మందులు కూడా మేమే ఇస్తాము.‘‘ అన్నారు.
నేను తేరుకోవడానికి చాలా సేపు పట్టింది. భూమి మీద ఆసుపత్రులు అనే కబేళాలే కాకుండా ఇటువంటి పుణ్యస్థలాలు కూడా ఉన్నాయా? అని అనిపించింది.
అమ్మను తీసుకువెళ్ళాను. నర్సులు, ఆయాలు, డాక్టర్లు వచ్చి వెళుతున్నారు.
అమ్మ మూడు రోజులు బాగానే ఉంది. నాలుగో రోజు అనుమానం వచ్చింది. ‘‘ఏంట్రా నన్ను వృద్ధాశ్రమంలో చేర్చావా? నువ్వు వెళ్ళిపోతావా?‘‘ అని అడిగింది.
అమ్మకు తాను వచ్చింది కూడా ఆసుపత్రే అని తెలియదు. అలా తెలియకుండా ఉండడమే హాస్పీస్ ప్రత్యేకత.
‘‘కాదు ఇది ఆసుపత్రే‘‘ అన్నాను. ‘‘మరి మన డాక్టర్ గారు రావడంలేదే?‘‘ అని అడిగింది.
‘‘ఇక్కడ డాక్టర్ మారారు. రెడ్డగారు. ఫణిశ్రీగారు అని కొత్తడాక్టర్లను పెట్టాను. అమెరికా డాక్టర్లు‘‘ అన్నాను.
గైరియాట్రిక్ అనే వైద్యవిభాగంలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్లు వాళ్ళు. ఇది ఎక్కువగా అమెరికాలో ఉంది. అంటే వీరు వృద్ధాప్యం వచ్చిన వారికి ప్రత్యేక వైద్యులు. మనకు చైల్డ్ స్పెషలిస్టులు ఎలా ఉన్నారో అలా అన్నమాట.
డాక్టర్ ఫణిశ్రీ అంటే మా అమ్మకు చాలా ఇష్టం. ‘‘చక్కగా చిలకలా ఉంటుంది. నాతో నవ్వుతూ నా కూతురులా మాట్లాడుతుంది. రోజూ వస్తోంది. ఆమె డాక్టరా?‘‘ అని ఆశ్చర్యపోయింది.
హాస్పీస్ లో డాక్టర్లు వైట్ కోటు కూడా వేసుకోరు.
‘‘అవును. చాలా పెద్ద డాక్టర్ అమెరికాలో చదువుకొని వచ్చింది‘‘ అన్నాను.
‘‘ఎంత సాధారణంగా ఉందిరా?‘‘ అని ఆమె ఆశ్చర్యపోయింది.
రోజూ ఆయాలు, నర్సులు, డాక్టర్లతో అమ్మ సంతోషంగా ఉంది. దాదాపు నెలగడవబోతోంది అనగా ఒకరోజు డాక్టర్ ‘‘ఈ రోజు గడవడం కష్టమే‘‘ అన్నారు.
సాయంత్రం వచ్చి చూసి తీసుకుపోవచ్చు అన్నారు.
రాత్రికి ఇంటికి ఎత్తుకు వచ్చాను. మర్నాడు ఉదయం మళ్ళీ ఎత్తుకువెళ్ళాము.
సరిగ్గా పదిరోజుల క్రితం నాకు స్పర్శ్ హాస్పీస్ నుంచీ ఎస్ ఎం ఎస్ వచ్చింది. అక్టోబర్ 14న హాస్పీస్ పాలియేటివ్ కేర్ ఉత్సవం జరుపుతున్నాము రండి అని ఆహ్వానం.
నా మనసులో అమ్మ మళ్ళీ మెదలింది. ఈ తొమ్మిది రోజులు అమ్మను గుర్తుచేసుకుందాం అని అనంతసాహితిలోని కేన్సర్ పేజీ ద్వారా ‘‘అవసానాలయం‘‘ పేరుతో పాలియేటివ్ నవరాత్రులు నిర్వహించాము.
అది నేటితో పూర్తి అయింది.
స్పర్శ్ హాస్పీస్ కి పొద్దున్నే వెళ్ళాను. అమ్మ మంచం ముందుగా చూశాను.
అక్కడే అమ్మ నవ్వుతూ నాతో మాట్లాడేది. ‘‘పసిపిల్లలా నవ్వుతోంది‘‘ అని నర్సులు అనేవారు.
అమ్మ జీవితంలో మొదటి సారి అక్కడే మ్యాక్సీవేసుకుంది.
అవన్నీ గుర్తు వచ్చాయి.
పిలవడం అయితే పిలిచారు కానీ వాళ్ళ ఎజెండా ఏమిటో నాకూ తెలియదు. వాళ్ళు రమ్మంటే వెళ్ళడమే కానీ ఎదురు ప్రశ్నలు వేయలేని బానిసను నేను. అడవిలోని సింహాన్ని గేటు దగ్గర కట్టిపారేసుకున్నారు వాళ్ళు.
వెళ్ళి కూర్చున్నాను. తమ ఆత్మీయులతో కలసి చివరి క్షణాలు పంచుకున్న వారంతా అక్కడికి వచ్చారు.అక్కడే ఉన్న ప్రస్తుతం పేషంట్లు కూడా వచ్చారు.
వారిలో నాకు ఒక కొత్త కుర్ర స్నేహితురాలు దొరికింది. చాలా చిన్నవయసు అమ్మాయి. నాతో నవ్వుతూ మాట్లాడింది. సిద్దిపేట నుంచీ ఒక మిత్రుడు తన చిన్నారి కుమారుడిని తలచుకోవడానికి వచ్చాను అని అన్నాడు. ఒక వృద్ధ దంపతులు తమ కుమారుడిని తలచుకోవడానికి వచ్చాము అన్నారు. మహబూబ్ నగర్ నుంచీ ఒక లేడీ డాక్టర్ తన ఆత్మీయులను తలచుకోవడానికి వచ్చామని చెప్పారు. ఒక భర్త తన భార్యను తలచుకోవడానికి వచ్చాను అన్నారు.
ఈలోగా చాలా విచిత్రం గా సభప్రారంభం అయింది.
రోహిణితల్లి ముందుగా వచ్చి హాస్పీస్ లో సేవ చేస్తున్న సిబ్బంది అందరిచేత, కార్యనిర్వాహకుల చేత దీపాలు వెలిగింపచేశారు.
తరువాత ఆత్మీయులను తలచుకుని ఒక్కొక్కరిని వచ్చి దీపాలు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించమని కోరారు.
ఒక్కొక్కరూ వచ్చి దీపం వెలిగించి తమ వారిని తలచుకుని తమ అనుభవాలు చెప్పారు.
ఒక కుమారుడుని కోల్పోయిన తండ్రి తానుపడిన బాధలు గుర్తుతెచ్చుకుని తన కుమారుడిని సదా గుర్తుచేసుకోవడానికి అద్భుతమైన సేవ ప్రారంభించానని చెప్పారు. తాను ఉండే ఏరియాలో శరీరాన్ని చలువ పేటికలో ఉంచడానికి ఒక రాత్రికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అది భరించలేని వారు చాలా మంది ఉన్నారని తాను గమనించానని, కనుక తాను ఉన్న ఏరియాలో వారికి అంతిమసేవ చేయడం కోసం శరీరాన్ని ఉంచే చలువ పేటిక తయారు చేయించానని చెప్పారు. ఎవరు అడిగినా దాన్ని నేనే నా చేతులతో ఎత్తి వ్యానులోపెట్టి వారికి పంపిస్తానని చెప్పారు. తాను చేపట్టిన సేవను చాలా మంది వ్యతిరేకించారని, శవాలను ఉంచిన పేటిక ఇంటిలో ఉంచుకోకూడదని అన్నారని అయినా తాను వినలేదని అన్నారు. తన కుమారుని అనుక్షణం గుర్తుచేసుకొని ప్రతి వ్యక్తికి చివరి సేవ నేను చేస్తున్నాను అన్నారు. తాను ఆ పని మాననని చెప్పారట. దీంతో కొందరు చెప్పిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకొని ఇంటి వాస్తు మార్చుకొని ఆ పేటిక వెళ్ళడానికి రావడానికి ప్రత్యేకంగా ఒక తలుపు చేయించానని చెప్పారు.
మానవత్వాన్ని మించిన సేవ మరొకటి లేదు. సర్వేశ్వరుడే శ్మశానంలో ఉన్నాడు. నిత్యం శవాలు కాలే కాశీపట్టణాన్ని మహానందవనం అంటారు. హిందూ సంప్రదాయాల్లో ఎవరో పుట్టించిన రోతకూతలు అవి. చావును కూడా సొమ్ముల సంపాదనకు కాకుండా మానవత్వంతో ఆయన చేపట్టిన నూతనసేవ అది. దాన్ని సమర్థించి వారిని అభిమానించడం జరిగింది. ముఖ్యంగా ఆయన కన్నా ఆయనతో వచ్చిన తల్లిని అభిమానించడం జరిగింది. భర్త చేస్తానన్న సేవను సమర్థించి ఆ పేటిక ఇంటిలో ఉంచడానికి సహకరించిన ఆ ఇల్లాలును ప్రథమంగా అభినందించడం జరిగింది.
ట్రస్ట్ చేస్తున్న సేవలను వివరిస్తూ సిఇఓ రామ్మోహన్ రావు తమకు తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇచ్చిందని స్పర్శ్ హాస్పీస్ ఇప్పటి వరకూ అద్దెభవనంలో నడిపామని స్థలం వచ్చింది కనుక అక్కడ 50 పడకలతో తమ కార్యకలాపాలు విస్తరిస్తామని అన్నారు. భవన నిర్మాణానికి ఇటీవలే డాక్టర్ మద్దిరాల సుబ్రహ్మణ్యం అమెరికా యాత్ర చేసి వచ్చారని చెప్పారు. దాతలు తమకు వాగ్దానాలు చేశారని భవన నిర్మాణం ప్రారంభిస్తున్నామని అన్నారు.
భవనాన్ని కూడా ప్రతి పేషంట్లకు హరిత వనాలు కనిపించే విధంగా నిర్మిస్తున్నామని తెలిపారు.
ఒక ఆత్మీయుని కోల్పోయిన దంపతులు మాట్లాడుతూ పేషంట్లకు హరిత మైదానాలు, సుందర దృశ్యాలు కనిపించేలా నిర్మించడం కేరళలో చూశానని అటువంటి నిర్మాణాలు ఇక్కడ కూడా చేపట్టడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. దాతలు ముందుకు వచ్చి భవన నిర్మాణం పూర్తికావాలని కోరుకున్నారు.
నాకు అక్కడ కలిగిని కొత్త కుర్ర స్నేహితురాలు మాట్లాడుతూ తనకు ఇంట్లో కన్నా ఇక్కడే చాలా బాగుందని చెప్పింది.
నేను కూడా అమ్మను తలచుకొని దీపంవెలిగించి రెండు మాటలు మాట్లాడతానని మొదలుపెట్టి చాలాసేపు మాట్లాడాను.
అమ్మ అక్కడ ఉండగానే మహబూబ్ నగర్ నుంచీ ఒక పేషంటు వచ్చాడు. అతని అంత్యక్రియలకు కూడా స్పర్శ్ హాస్పీసే డబ్బులు ఇవ్వడం నేను గమనించాను. అదే చెప్పాను. ఇటువంటి ఆసుపత్రి నేను ఎక్కడా చూడలేదన్నాను. ఇదే ఆధునిక దేవాలయం అన్నాను. పేషంట్లకూ, బంధువులకు ఇది ఒక తపోభూమి అన్నాను. ఇక్కడకు వచ్చి వెళ్ళిన వారికి జీవితంలో పరిపూర్ణత్వం వస్తుందన్నాను. జీవితం మీద పరిపూర్ణ అవగాహన వస్తుందన్నాను. దివ్యజీవనం అంటే ఏమిటో తెలుస్తుందని స్వానుభవంతో చెప్పాను.
జీవితచరమాంకంలోని వ్యక్తులకు ఒక వైద్యశాస్త్రరీత్యా సేవచేస్తూ, ప్రశాంతమనస్సును అందిస్తున్న సిబ్బందిని చూసి అసూయగా ఉందని నా అక్కసు వెళ్ళగక్కాను. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనో ఇటువంటి ఆర్తుల సేవ చేయగలరని, ఈ జన్మలో మళ్ళీ బ్రతికి ఉన్నవారికి అంత్యసేవలు చేసి స్పర్శ్ సిబ్బంది, కార్యనిర్వాహకులు, దాతలు ఇంకా పుణ్యంపెంచుకుంటున్నారని ఇదే నాకు అసూయకలిగిస్తోందని అన్నాను.
దేవతలు అంటే ఎక్కడో ఉండరని, నయాపైసా తీసుకోకుండా పేషంట్లకు అంత్యసేవను ఒకయోగంగా చేస్తున్నవారే దేవతలని చెప్పాను. దేవతలు అంటే వరాలిచ్చేవారు కాదు. దివ్యత్వం ఇచ్చేవారు. సామాన్యులకు తమ అనుగ్రహంతో దివ్యత్వాన్ని ఇస్తారు. మీరు కులమతప్రాంతీయతలకు అతీతంగా చేస్తున్న దేవతా సేవలను చూసి ఈర్ష్యపడుతున్నామని దాచుకోకుండా చెప్పాను. మీలో భాగస్వాములు కావడం వలన మేము కూడా దివ్యత్వం రుచి చూస్తున్నానని చెప్పాను. మా అమ్మచనిపోయే టప్పుడు ఆమెకు మీరు చేసిన సేవ చూశాక, మీ సేవలో నేను భాగస్వామ్యం కావడమే జీవితశేషంలో నేను చేయాల్సిన పనిగా ఆమె ఆధేశించిందనట్లుందని ప్రకటించాను.
మనిషికి మరణం తథ్యం. కానీ ఆ మరణంలోనూ గౌరవప్రదమైన మరణం ఉంటుందని చెప్పేదే హాస్పీస్. జీవిత చరమాంకవైద్య సేవ.
గత తొమ్మిది రోజుల నుంచీ ఈ రోజు వరకూ ఇవి చదువుతున్న మిత్రులకు ధన్యవాదాలు. మనిషికి మరణం తప్పదు. కానీ మరణంలో కూడా డిగ్నిటీ ఉంటుందని చాటిచెప్పేదే పాలియేటివ్ కేర్. సాధారణంగా నవరాత్రుల తరువాత ఆ సబ్జెక్టు విరమించడం జరుగుతుంది. పాలియేటివ్ కేర్ అంటే ఏమిటో తెలియని దుస్థితికి నేటి సభ్యసమాజం జారుకుంది. మహాభారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్న 58 రోజులే పాలియేటివ్ కేర్, హాస్పీస్ సేవలు. నేడు మన సంస్కృతి మనం నిలుపుకొని ఉంటే హాస్పీస్ అంటే ఏమిటో చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ దేవతలు మరింత తేలిగ్గా తమ సేవలు చేయగలిగి ఉండేవారు.
కనుక సామాన్యులకు కూడా హాస్పీస్ సేవలు అంటే ఏమిటి? పేషంట్ల పట్ల మనం ఎలా ఉండాలి? పేషంట్లు ఎలా ఉండాలో తెలియచెప్పే వ్యాసాలు కొనసాగుతాయి. స్పర్శ్ హాస్పీస్ నూతన భవనం నిర్మాణం జరుగుతున్న కారణంగా వారికి మద్దతుగా వారి సేవలకు ప్రచారం చేయడానికి ఇవి నిర్వహిస్తున్నాము.
చరమాంకంలోని కేన్సర్ పేషంట్లకు ఉచితంగా సేవలు చేస్తున్న స్పర్శ్ హాస్పీస్ వివరాలు అవసరమైనవారికి అందించండి. అవసానాలయాలలో మరణం కోసం వేచి చూస్తూ కేన్సర్ పేషంట్లు ఉన్నారు. వారిని దేవతలు సంరక్షిస్తున్నారు. వారికి మతం లేదు. కులం లేదు. వారికి కేవలం చావు మాత్రమే సత్యం.
వివరాలకు:
స్పర్శ్ హాస్పీస్
బంజారాహిల్స్
040 2338 4039
94904 48222
-------------------------------
ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం
ప్రత్యామ్నాయ మాధ్యమ పాత్రికేయ నిపుణుడు (forwarded msg) to

No comments:
Post a Comment