2వ భాగం
కాత్యాయని వయసు 40 పైనే ఉంటాయి. . టిప్ టాప్ గా తయారవటం కలుపుగోలుగా ఉండటం వలన కాలనీలో అందరి తో పరిచయం ఏర్పడింది. భర్తబేంక్ ఉద్యోగి. కొడుకు చిన్నవాడు పేరున్న బడిలో
3వ క్లాస్ చదువుతున్నాడు. ఆమె గతం ఎవరికీ తెలియదు. ఆకొలనీలో అన్ని ఇళ్లలోకి అందమైనదీ పెద్దదీ వారి ఇల్లే. ఆఇంటికి వచ్చే వారంతా పెద్ద కారుల్ల్లో వచ్చేవారు. కాత్యాయని తో స్నేహం చేద్దామని ఆ కో లనీ వాసులంతా తెగ ఆరాటపడ్డా ఆ అదృష్టం ఒక్క రికే దక్కింది. పక్క ఇంటిలో నుండి అప్పుడప్పుడు వినిపించే సంగీత వాద్యాల మ్రోత కాత్యాయని ని ఆకర్షించింది. సంగీతానికి ఆకర్షించ బడ్డ కాత్యాయని పొరిగింట్లో ఉన్న సోమేశ్వరశర్మగారింటికి వెళ్లి శర్మ గారి మనుమరాలు సంగీతం నేర్చుకుంటున్నాదని తల్లి అక్కడే స్థిర నివాసం ఏర్పరు కుం ద ని తెలుసుకుని పరిచయం చేసుకుంది. ఆ పరిచయం స్నేహంగా మార టా ని కి ఎక్కువ రోజులు పట్ట లేదు. రోజుకి ఒకసారైనా కలసి కష్టం సుఖం మాట్లాడకుండా వుండలేని చనువు ఏర్పడింది. కాత్యాయని మాటకారి. మాటల్లో ఇందిర కాపురం గురించి వివరాలు తెలుసుకోవటం కాత్యాయనికి కష్టం కాలేదు. ఇందిర తన మిడిమిడిజ్ఞానంతో తన
జీవితపుస్తకాన్ని కాత్యాయని ఎదుట పెట్టింది. ఆ సందర్భంలో కాత్యాయనిగత జీవితగాధ,బాధ ఇందిరకి తెలిసి వచ్చేయి. కాత్యాయని 19 ఏళ్లకేచుట్టాలు అబ్బాయితో వివాహంజరిగింది.
కాత్యాయని అహంకారి. తండ్రి కి ఆమె అంటే ముద్దు. చిన్నప్పటినుండి పల్లెతుమాట అనకుండా ఏ ది అడిగినా లేదనకుండా ఇచ్చే తండ్రి ఉండటం వలన విచక్షణ లేకుండా మాట్లాడడం, మర్యాద లేకుండా ప్రవర్తించడం అలవాటైపోయింది. 19వ ఏట పెళ్లి గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న , ఏ దురలవాట్లు లేని రంగనాధంతో జరిగింది. రంగనాధం మనిషి మంచివాడు, తెలివైనవాడు. కానీ తనే తెలివైనవాడనీ, తన మాటకి ఎదురు ఉండకూడదని నమ్మే మనిషి. అంతేకాదు అందర్నీ చిన్నచూపు చూడటం తన జన్మహక్కు అనినమ్మే వ్యక్తిత్వం కల వాడు. ఏది ఏమైనా ఇద్దరి మనస్తత్వాలు కలియలేదు. పెళ్లి అయిన 5 ఏళ్ళు కుక్కా పిల్లుల్లా కాట్లాడుకుని విడిపోయారు. కాత్యాయనితండ్రి సలహా సహకా రాలతో భర్త నుండి రొక్కం భరణం గా తీసుకుని స్వతంత్ర మహిళగా జీవితం మొదలు పెట్టింది. రంగనాధం అహంకారం దురుసు ప్రవర్తన మూలంగా 4సంవత్సరాల వరకు తిరిగి పెళ్ళి చేసుకోలేక పోయేడు. కాత్యాయని తండ్రి ప్రోద్బలం తో తనకు నచ్చిన బ్యాంకు ఆఫీసర్ రాజారావు ని సంతోషంగా భర్త స్థానంలో తెచ్చుకుంది. ఇందిర ఈ విషయాలన్నీ కాత్యాయని నుండి తెలుసుకుని కాత్యాయని తో సంప్రదించి తండ్రి ను ఒప్పించి భర్త పై కోర్టులో పిటిషన్ వేసి తనకీ పిల్లలకీ జీవనోపాధి కొరకు నెలకి 2 లక్షలు ఈయాలని కోర్టు ని ఆశ్రయించింది.
No comments:
Post a Comment