Sunday, March 21, 2021

 1వ భాగం


ఇందిర కల్లా కపటం లేని అమాయకురాలు కాదు. అలా అని చదువుకుని ప్రపంచజ్ఞాన్నాన్నిఆకళింపు  చేసుకున్న గడుసు పిండం కాదు. తల్లి చాటు పిల్ల కాదు. తండ్రి గారాబం చేయటం వాస్తవం.  దాని ప్రభావమే తన జీవితంలో తప్ప టడుగులు పడటానికి కారణమయ్యేయి.

వార్ధక్యంలోకి అడు గుపెడ్తున్న ఇద్దరు పిల్లల తల్లి ఇందిర గురించి తెలియజేయటంలో రచయిత ఆశయం ' స్త్రీ జనాభ్యుదయం ' అని నినాదాల తో సమాజాన్ని వూ దర గొడుతున్న సాంఘిక సంస్కర్తలకు కనువిప్పు కలుగు తుందని మాత్రమే. అన్యధా భావిం చ వలదు.

ఇందిర , సోమేశ్వరశర్మ  సోమిదేవమ్మా దంపతులకు కలిగిన మూడవ సంతానం. ఇద్దరుమగపిల్లల తరువాత లక్ష్మీదేవి ఇంటికి తరలివచ్చినదని తలిదండ్రులు మురిసిపోయేరు. తల్లి ప్రోద్భలం, తండ్రి సహకారం, అన్నదమ్ముల అభిమానం వలన చిన్నప్పటి నుండీ ఆడింది ఆట పాడింది పాటగా పెరిగిన ఇందిరకి యుక్త వయస్సు రాగానే వివాహం చేసి బాధ్యత నెరవేర్చు కున్నారు శర్మ దంపతులు. సీతాపతికలిగిన కుటుంబలోనుండి వచ్చేడు. కాలేజ్ చదువు అయింది అనిపించే డు. తండ్రి ప్రభుత్యోద్యోగి. ఆస్తి ఉంది. ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు కాబట్టి వ్యాపారం చేయటం అందులో అనుభవ రాహిత్యం వలన నష్టాలు రావటం పెళ్ళి అయిన కొద్దికాలంలోనే సీతాపతిఅనంత కోటి నిరుద్యోగుల్లో ఒకడిగా మిగిలిపోయేడు. ఉద్యోగం లేక పోయినా ఆదాయం లేకపోయినా సంసారం  భార్య , ఇద్దరు పిల్లలతో కొన్ని సంవత్సరాలు సాగించేడు. తండ్రి కూతురి కష్టాలు చూసి మనసు కరిగి ఆర్ధిక సహాయం చేసేవాడు. కాలగర్భంలో 5 సంవత్సరాలు గడిచే యి. ఏమైందో ఏమో కాని రెండవ సంతానం కలిగిన కొద్ధి రోజుల్లో ఇందిర పిల్లల్ని తీసుకుని తండ్రి పంచన చేరింది. కూతురి మీద జాలి,  పిల్లల మీద అమిత మైన ప్రేమ వలన వృద్ధ దంపతులు పిల్లనీ, పిల్లల్ని తమ దగ్గరే వుండనిచ్ఛేరు. సీతాపతి భార్యాబిడ్డల్ని ఇంటికి తేలేదు. ఇందిర కూడా భర్త వద్దకు వెళ్ళటానికి తయారవలేదు.

          **          **           **


కాత్యాయని వయసు 40 పైనే ఉంటాయి. . టిప్ టాప్ గా తయారవటం కలుపుగోలుగా ఉండటం వలన కాలనీలో అందరి తో పరిచయం ఏర్పడింది. భర్తబేంక్  ఉద్యోగి. కొడుకు చిన్నవాడు  పేరున్న బడిలో

3వ క్లాస్ చదువుతున్నాడు. ఆమె గతం ఎవరికీ తెలియదు. ఆకొలనీలో అన్ని ఇళ్లలోకి అందమైనదీ పెద్దదీ వారి ఇల్లే. ఆఇంటికి వచ్చే వారంతా పెద్ద కారుల్ల్లో వచ్చేవారు. కాత్యాయని తో స్నేహం చేద్దామని ఆ కో లనీ వాసులంతా తెగ ఆరాటపడ్డా ఆ అదృష్టం ఒక్క రికే దక్కింది. పక్క ఇంటిలో నుండి అప్పుడప్పుడు వినిపించే సంగీత వాద్యాల మ్రోత కాత్యాయని ని ఆకర్షించింది.  సంగీతానికి ఆకర్షించ బడ్డ కాత్యాయని పొరిగింట్లో ఉన్న సోమేశ్వరశర్మగారింటికి వెళ్లి శర్మ గారి మనుమరాలు సంగీతం  నేర్చుకుంటున్నాదని తల్లి అక్కడే స్థిర నివాసం ఏర్పరు కుం ద ని తెలుసుకుని పరిచయం చేసుకుంది. ఆ పరిచయం స్నేహంగా మార టా ని కి ఎక్కువ రోజులు పట్ట లేదు. రోజుకి ఒకసారైనా కలసి కష్టం సుఖం మాట్లాడకుండా వుండలేని చనువు ఏర్పడింది. కాత్యాయని మాటకారి. మాటల్లో ఇందిర కాపురం గురించి వివరాలు తెలుసుకోవటం కాత్యాయనికి కష్టం కాలేదు. ఇందిర తన మిడిమిడిజ్ఞానంతో తన  

జీవితపుస్తకాన్ని కాత్యాయని ఎదుట పెట్టింది. ఆ సందర్భంలో కాత్యాయనిగత జీవితగాధ,బాధ ఇందిరకి తెలిసి వచ్చేయి. కాత్యాయని 19 ఏళ్లకేచుట్టాలు అబ్బాయితో వివాహంజరిగింది.

No comments:

Post a Comment