Friday, December 11, 2020

 రామలక్ష్మణులవలె రెండు సపోటా చెట్లు ఇంటికి నీడ ని మాత్రం ఇచ్చే వి. ఇంటి నిండాఅరటి చెట్లు, గోడ వార్న కొబ్బరిచెట్టు, మూడొంతుల ఖాళీస్థలం లో పూ ల మొక్కలు పట్నంలో ఉన్న నేను వచ్చిన వారికి ఎంతో నచ్చే ను.

ఇంటి యజమానురాలికి పువ్వుల మొక్కలు అంటే పిచ్చి. మందార, నందివర్ధనం,మల్లె, సన్నజాజి, గన్నేరు, కనకాంబరం పువ్వుల మొక్కలు , పెద్ద జామి చెట్టు , రాచ ఉసిరి, మామిడి చెట్లు నన్ను ఆకర్షణీయంగా ఉంచేవి.

కొన్ని ఇబ్బందులు కూడా ఉండేవి. వీధిలోని పిల్లలు ఉసిరికాయల కోసం జామికాయల కోసం విసిరే రాళ్లు నాకు తగిలేవి. అరటి చెట్లు ఎన్నో ఉండేవి. ఇంట్లో తరచు అరటి కాయ కూర వండేవారు.

కొన్ని సంఘటనలు గుర్తున్నాయి.. ఇంటి పెద్ద ఉదయానే లేచి పూలు కోయడం అలవాటు. ఒకనాడు నందివర్దనామ్ పూలు కొస్తుంటే  ఏదో కుట్టింది అని హడావుడి చేస్తే పెద్దాసుపత్రి కి తీసుకు వెళ్ళేరు. అక్కడ ఆయన చేసిన హడావుడి కి ఆసుపత్రి అంతా చిందులు వేసిందని వినికిడి. ఇంటి యజమానురా లి రెండో తమ్ముడు పోస్టుమాస్టర్. ఆరోగ్యానికి మారు పేరు. క్రమశిక్షణలో దిట్ట. అతనంటే అందరికి భయం, గౌరవం . 1957లో అనుకుంటాను. పచ్చకామెర్లు వచ్చి విశాఖపట్నం లో పెద్దాసుపత్రిలో సుమారు మూడు  మాసాలు చికిత్స తో కొలుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో పరిస్థితులకు నేను మాత్రమే సాక్షి. ముసలి తండ్రి కామెర్ల పసరు మందు కోసం ప్రతీ గురువారం ఉదయం 6 కి లేచి మూడు మైళ్ళు వెళ్లి మందు తే వటం అతని ఆతృతకి తార్కాణం. ఇంట్లో ఉదయం ఇంట్లో చేసిన కాఫీ , దారిలో మణి స్ కెఇఫ్ లో ఇడ్లి తీసుకుని 630కి రాజేంద్ర ప్రసాద్ వార్డ్ లో అందజేసి తిరిగి ఇంటికి వచ్చి 10 కి కాలేజ్కి వెళ్ళటం అసాధ్యం అయినా చేసేరు. దేవుని దయ వలన ముసలి దంపతుల , భార్య పూజల వలన ఆరోగ్యంగా ఆయన ఇంటికి రావటంతో అందరూ సంతోషించేరు.


మరొక జ్ఞాపకం :

దగ్గర్లో లలితా నగరంలో జానకిరామ గారి తమ్ముడు ఉండేవాడు. ఆయన కి యూనివర్సిటీలో ఉద్యోగం .పగలల్లా ఉద్యోగం , ప్రయివేటు లు చెప్పి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవారు. అయినా వారానికి ఒక మారైనా అక్కయ్యని పలకరించటానికి భార్యను తీసుకుని ఎంత రాత్రైనా వచ్చేవాడు. అతని పిల్ల లు కూడా అభి మానంగా వస్తూ పోతూ వుండేవారు. 1959-60 లలో అనుకుంటాను. వీధిలో అన్ని ఇళ్ల లోకన్నా నా ఇంట్లోనే చదువుకున్నవాళ్ళు ఉద్యోగస్తులు ఉండేవారు. అందికేనేమో నేనంటే ఆ వీధి లో అందరికీ ఈర్ష్యగా ఉండేది. ఊళ్ళో సిటీ బస్సులు ఎక్కువయి 13 వ నంబర్ బస్  అందరికి సదుపాయంగా ఉండేది. ఆరుగురు ఉదయం 9 కి భోజనాలు ముగించి బస్ కోసం పరి గె త్తే వారు.  ఒకొక్కరు ఒక్కొక్క స్టాప్ లో దిగి ఆక్

బంగారుతల్లి.  1954

ఆఇంటి విశేషం : అనారోగాలతో సతమత మవుతున్నా మరణాలు జరుగుతున్నా ఇంట్లో అందరూ ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని జీవితాన్ని సాగించేరు. ఇంటికి వచ్చిన అతిధుల గురించి ప్రత్యేకంగా ఉటంకించాల్సి ఉంది. 

బంగారుతల్లి పుట్టినప్పుడు సీతాపిన్ని అక్కగారు చెల్లాయమ్మ సహాయానికి వచ్చి అందరితో కలివిడిగా ఉం డేది.

సుభద్ర మ్మగా రి చెల్లెలు సూర్యకాంతం భర్తతో రైల్వె క్వార్టర్స్ లో ఉండేది .కానీ తరచు తలి దండ్రుల్ని తోబుట్టువుల్నీ చూడ టా నికి వస్తూ ఉండేది. మరొక చెల్లెలు దగ్గర వూరిలో నే వుంటూ వస్తూ పోతూ ఉండేది. ఆమె భర్త వైద్యం కోసం తరచు విశాఖపట్నం రావలసి వచ్చేది. కొన్నాళ్ళకి ఒకే కొడుకు కాలేజి చదువుకు వచ్చేడు. నాకు ఊ పిరి పీల్చుకోవటం కష్టమయేలా ఇంట్లో 10-14 మంది వుండేవారు. సీతపిన్ని అక్కగారు పిల్లలు (రావి వారు) వచ్చి ఎక్కువ రోజులు గడిపేవారు. ఎవరికైనా యూనివర్సిటీ లో ప్రవేశం దొరికితే నా దగ్గరకు వచ్చి కనీసం వారం రోజులైనా వుండి వెళ్తుండేవారు. ఆదాయం లో వృద్ధి లేకపోయినా వ్యయం పెరుగుతూ వుండేది. ఆ సమయంలోనే

No comments:

Post a Comment